Sushrutaas

Picture
సుశృతుడు క్రీ.పూ 800 సం. లో. రచించిన "సుశృత సంహిత" అనే గ్రంధంలో దాదాపుగా 300 రకముల శస్త్రచికిత్సల గురించి మరియు 120 రకముల శస్త్రపరికరముల గురించి వివరించియున్నారు. శస్త్రచికిత్సా విధానాలను ఎనిమిది రకములుగా విభజించిన ఘనతను గాంచి, "శస్త్రచికిత్సా పితామాహుని" గా పేరునార్జించారు.
ముఖ్యముగా ఈయన కనిపెట్టిన ఎన్నో విధానాలు శస్త్రచికిత్సకు ప్రాణముపోసాయి.
1. చీమల తలాలను కుట్లు వేయుటకు ఉపయోగించుట
2. మానవ శరీరమును అధ్యయనము చేయుట
3. తెగిన ముక్కును తిరిగి యధా స్థానములో ఉంచి, మొదటి సౌందర్య శస్త్రచికిత్స చేయుట
ఇలా ఎన్నో ప్రక్యాథి గాంచిన విషయములలో మనకు మార్గదర్శకముగా నిలిచిన మహనీయుడు.


మహామహోపధ్యాయ కవిరత్న కవిరాజ ద్వారకనాధ్ సేన్ అను కవి సుశృతసంహితను ఆంగ్లములోకి అనువదించారు[1907 - 1916]