Dhanvantharees

Picture
భాగవతమున చర్చించినటుల, ధన్వంతరి పాలకడలిని దేవదానవులు చిలికినపుడు, అందు నుంచి చతుర్భుజుడై ఆవిర్భవించాడు. ఈయనను దేవ వైద్యునిగా, విష్ణు అంశ సంభూతుడుగా, ఆయుర్వేద కర్తగా, భారతీయ పురాణాలు చెప్పుచున్నవి.

ఓం నమామి ధన్వంతరీమాది దేవామాం సురాసురైర్వందిత పద్మాం!
లోకే జరారోగం భయ మృతయు నాశమాం ధాతారమిశాం వివిధౌషధినామాం!
ధన్వంతరీ రమనాధమ్ సర్వరోగా నివారాణాం ఆయుర్వేదౌ ప్రవక్తారాం వందే పీయూషదాయాకాం!

ఒక చేతిలో అమృత కలశముతొ, మరొక చేతిలో సుదర్శనముతో, అభయ హస్తముతో ఆవిర్భవించిన ధన్వంతరి, ఆయుర్వేదమును మానవాళికై, వారి సకల దుఖ, రోగ భయ నివారణార్దాం వివరించారని ప్రతీతి.

ఓం నమో భగవతే మహా సుదర్శనా వాసుదేవాయా ధన్వంతారయే!
అమృత కలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ!!
త్రిలోక్య పతాయే త్రిలోక్య నిథయే శ్రీ మహా విష్ణు స్వరూప!
శ్రీ ధన్వంతరీ స్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా!!