Charakans

Picture
న పశ్యతి విభుః కస్మాత్ఛౌలోకాంచ తిరస్కృతాం!
క్షాత్రోజ్ఞహ క్షాత్రోమథవా కిమ్ వమితి సంశయహ!!

"చరక సంహిత" అను గ్రంధములో చరకుడు ఎన్నో ఉత్తమమైన మార్గాలు, వైద్యుల కొరకై ప్రతిపాదించారు.
  "జ్ఞానం మరియు అవగాహన అనే లాంతరు లేకుండా వైద్యుడు రోగిని ఎన్నటికీ ఆరోగ్యవంతుని చేయలేడు. మొదటగా వైద్యుడు అన్ని కారణాలను, పరిసరాలతో సహా, అవగాహన చేసుకుని మాత్రమే చికిత్సను నిర్ణయించాలి. ఎప్పుడైనను వ్యాధిని నయము చేయూత కంటే నివారించుటయే ఉత్తమమైన మార్గము." అని భోధించి ఆధునిక వైద్యులకు ఆదర్శప్రాయుడైనారు.
రోగులను వాత, పిత్త, కఫ దోషాది రకములుగా స్థూలముగా విభజించిన మొదటి వైద్యుడు ఈయన. జన్యు శాస్త్రం మరియు శరీరధర్మశాస్త్రం బాగుగా అభ్యసించుటయే కాక, 120 అధ్యాయాలు, 8 భాగాలుగా గ్రంధస్తం చేశారు.