Atreyans

Picture
ఆత్రేయుని భూమండలానికి తొలి వైద్యునిగా, భారతీయ ఇతిహాసాలు చెప్పుచున్నవి. ఆత్రేయుడు అత్రి మహాముని వారసునిగా, భరద్వాజుని నుంచి ఆయుర్వేదమును అందుకున్నారు. ఈ ప్రస్తుత కల్పంలో, మానవుల బాధలు తీర్చటానికి, దేవలోకములో ఉన్న ఆయుర్వేదాన్ని భువికి తేవడం కోసం భరద్వాజుడు బ్రహ్మ వద్దనుంచి ఆయుర్వేదాన్ని నేర్చుకుని, ఆత్రెయునికి నేర్పించారు. ఆయన తర్వాత అగ్ఞివేశునికి బోధించి, "అగ్ఞివేశతంత్రం" అనే బృహత్తర గ్రంధం రచియింప చేశారు. కానీ అది పరిపూర్ణంగా, చరకునిచే "చరకసంహిత" గా రూపుదిద్దుకుంది.